బుంగ అనిల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో చలివేంద్రం ప్ర్రారంభం

Published: Tuesday March 16, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నాగారం గ్రామంలో బుంగ అనిల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు మెంబర్ నందిపాటి బాబు మరియు బుంగ అనిల్ ఫౌండేషన్ చైర్మన్ బుంగ సునిల్ ప్రారంభించారు. సందర్భంగా సునిల్ మాట్లాడుతూ యువత రాజకీయాలలోకి రావాలని ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథం అలవర్చుకోవాలని బుంగ అనిల్ ఫౌండేషన్ ఇప్పటి వరకు వివిధ గ్రామాలలో సామాజిక సేవ కార్యకరమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగాల మహేష్, మైసోళ్ళ మహేష్, కట్ట బిక్షం, రాచమళ్ళ ఉత్తరయ్య, సాయి, అన్నెపర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.