తలసేమియా,సికిల్ సెల్, హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి

Published: Thursday August 04, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 03, ప్రజాపాలన: తలసేమియా,సికిల్ సెల్, హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలాని బుధవారం రోజున  మంచిర్యాల జిల్లాలోని తలసేమియా,సికిల్ సెల్,సికిల్ తల్,హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల జీవో నెంబర్ 5 తేదీ 13.06.2018 ప్రకారంగా తలసేమియా,సికిల్ సెల్,సికిల్ తల్,హీమోఫిలియా వ్యాధిగ్రస్తులకు, వికలాంగుల సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి అని జిల్లా ఆడిషినల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ను, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఆర్.ఎం.ఓ శ్రీమన్నారాయణ, కలిసి వినతిపత్రం ఇచ్చారు.  
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ జిల్లా సూపరింటెండెంట్, డి.ఎం.హెచ్.ఓ తో మాట్లాడి న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కాసర్ల శ్రీనివాస్, కాసర్ల రంజిత్ కుమార్   మాట్లాడుతూ 
 
రాష్ట్ర తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్ లో తేదీ 25-03-2021 నాడు పేటిషన్ కేసు వేయడం జరిగింది.
ఈ కేసు కు సమాధానంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రినిసిపల్ హెల్త్ సెక్రటరీ హెల్త్,మెడికల్,ఫ్యామిలి వెల్ఫేర్  లేఖ ద్వారా తేదీ 23.06.22 నాడు సమాధానం పంపుతూ ఆ సమాధాన లెటర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 5 తేదీ 13.06.2018 నాడే జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో వికలాంగుల సదరం సర్టిఫికెట్లు పొందాలి అని ఆనాడే జీఓ పంపించాము అని మరోసారి సమాధానం కూడా పంపుతూ జిల్లా హాస్పిటల్ లో వికలాంగుల సదరం సర్టిఫికెట్లు పొందాలి అని ఆదేశించారు అని అన్నారు.వెంటనే మానవ హక్కులు కమిషన్ రాష్ట్ర ప్రినిసిపల్ హెల్త్ సెక్రటరీ ఆదేశాలను జీఓ నెంబర్ 5 ను చట్టబద్ధంగా  పరిగాణములోనికి తీసుకొని ప్రజా ప్రతి నిధులు, పాలన అధికారులు వికలాంగుల సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో తలసేమియా, సికిల్ సెల్, సికిల్ తల్,హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు, తల్లిదండ్రులు ఆడేపు సతీష్, దుర్గం ప్రవీణ్, జడి వంశిక, మెస్రం, దుర్గం శంకర్ తదితరులు   పాల్గొన్నారు.
 
 
 
Attachments area