వివిధ డివిజన్ కార్పొరేటర్లు పరిసరాల పరిశుభ్రత కొరకు కమిషనర్ కు వినతి

Published: Tuesday May 18, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : మహమ్మారి తీవ్రత ను దృష్టిలో పెట్టుకొని,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆదేశానుసారంగా మీర్ పేట కార్పొరేషన్ లోని పరిసరాల పరిశుభ్రంగా ఉంచడానికి వివిధ డివిజన్ కార్పొరేటర్లు ముందుకొచ్చి కార్పొరేషన్ కమిషనర్ కు ప్రజా ప్రతినిదైన డిప్యూటీ మేయర్ కు వినతి పత్రాలను సమర్పించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో ఉన్నటువంటి 46 డివిజన్ లో, కొన్ని డివిజన్ ల 7వ, 11వ, 12వ, 16వ, 24వ, 28వ, 30వ, 31వ, 32వ, 35వ, 44వ, 45వ, 46వ  కార్పొరేటర్లు కరోనా మహమ్మారి వైరస్ కట్టడి చేయటానికి మేము సైతం అంటూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలినీ, అదేవిధంగా కాలనీలో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఉద్దేశంతో, సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండటానికి, మా వంతు సాయం చేస్తామని చెబుతూ సోమవారం నాడు కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావుకు, అదేవిధంగా ప్రజాప్రతినిదైన కార్పొరేషన్  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి  కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ... తమ తమ డివిజన్లో వారు కరోనా మహమ్మారి తీవ్రత ను దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య పనులు మూడు రోజులకు ఒకసారి క్లోరోఫామ్ హైపో ద్రావణాన్ని (స్ప్రే) పిచికారి చేయించుకోవాలని, ఏడు రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ ను, అదేవిధంగా అక్కడక్కడా పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించాలని, డ్రైనేజ్ క్లీనింగ్ చేసిన చోట తీసిన స్టీల్ట్ ను వెంటనే తొలగించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికుల తో పాటు ఆ ఆ డివిజన్ కార్పొరేటర్లు  మేము సైతం అంటూ కోరడం జరిగిందని చెప్పారు. (కార్పొరేషన్ మేయర్ లేకపోవడంవల్ల డిప్యూటీ మేయర్ కు వినతి) ఈ కార్యక్రమంలో సిద్ధాల చిన్న బీరప్ప, దోమలపల్లి ధనలక్ష్మి రాజు కుమార్, ఇంద్రావత్ రవి నాయక్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, తీగల మాధవి సాయినాథ్ రెడ్డి, జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి, పిడుగు ప్రమీల  యాదగిరి ముదిరాజ్, పాలమురి విజయలక్ష్మి రాజ్ ముదిరాజ్, వేముల నరసింహ్మ, జిల్లా సౌందర్య విజయ్, దరంకారు జ్యోతి కిషోర్, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, ఉయ్యాల నవీన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.