మొండికుంట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.

Published: Tuesday October 04, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రజా పాలన.

ఈరోజు బతుకమ్మ సంబరాల్లో భాగంగా చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ పండుగను మొండికుంట గ్రామంలో అధికమంది తెలంగాణ ఆడపడుచులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు ప్రత్యేకత అయినటువంటి దసరా పండుగను ముందు రోజు వచ్చే బతుకమ్మ పండుగను లక్షలాది ప్రజలు తెలంగాణ సాంప్రదాయపద్ధంగా వక్కేసి పువ్వువేసి చందమామ అన్నట్లుగా తీరొక  పువ్వులతో పేర్చి పూజించి బతుకమ్మ సంబరాలు ప్రతి ఒక్క ఇంట్లో తెలంగాణ ఆడపడుచులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో అశ్వాపురం మండలం, మొండికుంట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను వందలాది మంది ఆడపడుచులు బతుకమ్మను ఎత్తుకొని పూజించి అన్ని కుటుంబాలు ఆనందోత్సవాలు వెళ్లవలసిన గౌరమ్మని పూజిస్తూ పూలను పూజిస్తూ తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా సద్దుల బతుకమ్మ వేడుక నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొండిడుకుంట సర్పంచ్ మరి మల్లారెడ్డి మరియు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జాలి రామకృష్ణారెడ్డి సురకండి ప్రభాకర్ రెడ్డి తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగినది. వైస్ ప్రెసిడెంట్ మేడవరపు సుధీర్ కూడా పాల్గొనడం జరిగినది.