కె.సి.ఆర్ భారత దేశంలోనే నెం.1 అవినీతి ముఖ్యమంత్రి

Published: Friday February 05, 2021
బీ.జే.పీ కోర్ కమిటీ సభ్యులు గడ్డం వివేక్  వెంకటస్వామి
 
వెల్గటూర్, మార్చు 04 (ప్రజాపాలన): కె.సి.ఆర్ భారత దేశంలోనే నెంబర్వన్ అవినీతి ముఖ్యమంత్రి అని బీ.జే.పీ కోర్ కమిటీ సభ్యులు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం రోజు వెల్గటూర్ మండలం రాజారామ్ పల్లి లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్ పొంది ముఖ్యమంత్రి ఆస్తులు పెంచుకొని తెలంగాణ ప్రజలకు అప్పుల భారం పెరిగిందని ఆయన అన్నారు.ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రిని వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం లేదు ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందని తెలంగాణ యువకులు ఆశిస్తే కల్వకుంట్ల కుటుంబానికి అందరికీ ఉద్యోగాలు వచ్చినయ్ అని ఆయన దుయ్యబట్టారు. సన్నరకం వరి పంట వేసుకోమని చెప్పిన కేసీఆర్ సన్న రకాలు కొనుగోలు చేయలేదు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వరి కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తున్న ప్రభుత్వం ప్రకటించింది అని ఆయన అన్నారు.అంతకుముందు రాజరంపల్లి కూడలిలో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి.ధర్మపురి నియోజకవర్గం లో అధిక సంఖ్యలో వివిధ పార్టీల నుండి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బి.జె.పి పార్టీలో చేరారు వీరందరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బి.జె.పి రాష్ట్ర నాయకులు ఎం.డి బషీర్, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నం అంజయ్య, కొమ్ము రాంబాబు, మండల శాఖ అధ్యక్షుడు తంగళ్ళపల్లి చక్రపాణి, కాడేసూర్యనారాయణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, కార్యవర్గ సభ్యులు గుంతసంతోష్, నేతకాని సంఘం ఉపాధ్యక్షులు జాడి రాజేశం, సంఘ వెంకటగిరి, ధర్మపురి, ధర్మారం, గొల్లపల్లి, పెగడ పల్లి వెల్గటూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు రావు హనుమంతరావు, సీనియర్ నాయకులు పోనగొటి ఉపేందర్ రావ్, గుమ్మల సతీష్,క్యా యాతం సుధాకర్, మండల స్థాయి కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.