నకిలీ రెగ్యులేటర్లు విక్రయిస్తే కఠిన చర్యలు

Published: Saturday December 17, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
 
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 16, ప్రజాపాలన  :
 
గృహాలు, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఉపయోగించే రెగ్యులేటర్ల విషయంలో నకిలీ వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో నకిలీ రెగ్యులేటర్ల విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ రెగ్యులేటర్లు విక్రయిస్తున్నట్లుగా తమ దృష్టికి రాగా మార్కెట్రోడ్ ని డైమండ్ అప్లియన్సెస్లోలో తనిఖీలు చేపట్టగా హెచ్.పి.సి.ఎల్., ఐ.ఓ.సి.ఎల్., బి.పి.సి.ఎల్.కు సంబంధించిన నకిలీ రెగ్యులేటర్లు. విక్రయిస్తున్నట్లుగా నిర్ధారించడం జరిగిందని, షాపు యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు రెగ్యులేటర్లు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ వాటిని కొనుగోలు చేయవద్దని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.