పూలే, అంబేడ్కర్, సందేశ్, యాత్రను జయప్రదం చేయండి

Published: Thursday April 01, 2021

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్
ఆసిఫాబాద్ జిల్లా, మార్చి31, (ప్రజాపాలన ప్రతినిధి): పూలే, అంబేడ్కర్, సందేశ్, యాత్రలను  జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని కెవిపిఎస్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు జాడి మల్లన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకరన్ మాట్లాడుతూ ఈ ఏప్రిల్ నెల ను మహానీయుల మాసంగా నిర్వహించాలని అన్నారు. నేడు ఏప్రిల్ 1 నుండి 30 తారీఖు వరకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన నీలి దండు కవాత్తు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో ఏప్రిల్ 22 నుండి పూలే, అంబేద్కర్, సందేశ్, యాత్ర ఉంటుందని అన్నారు. 12న జిల్లా కేంద్రంలో నీలి  టి షర్ట్ వాలంటరీ ల కవాతు ఉంటుందన్నారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగం చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమములో కెవిపిఎస్ జిల్లా నాయకులు ఇప్ప ప్రసాద్, దుర్గం శ్రీనివాస్, చునార్కర్ రాజశేఖర్, బొర్కుటే శ్యామ్ రావు, తిరుపత కార్తీక్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.