రాంపూర్ గురుదొట్ల గ్రామాల ఎస్టీ రైతులకు పల్లీ విత్తనాలు పంపిణీ

Published: Wednesday September 15, 2021
ధారూర్ మండల రైతు బంధు అధ్యక్షుడు చొప్పరి వెంకటయ్య ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 14 సెప్టెంబర్ ప్రజాపాలన : గిరిపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీ తో పల్లీ విత్తనాలను అందజేస్తుందని ధారూర్ మండల రైతు బంధు అధ్యక్షుడు చొప్పరి వెంకటయ్య ముదిరాజ్ అన్నారు. మంగళవారం ధారూర్ మండల పరిధిలోని రాంపూర్, గురుదొట్ల గ్రామాల ఎస్టీ రైతులకు వైస్ ఎంపిపి విజయ్ నాయక్ ఆధ్వర్యంలో సబ్సిడీపై పల్లీ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధారూర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో 70 క్వింటాళ్ళ పల్లీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక్క పాసు బుక్కు 2 బస్తాల పల్లీ విత్తనాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఒక్క బస్తాలో 20 కిలోల పల్లీ విత్తనాలు ఉంటాయని ఉద్ఘాటించారు. ఒక్క క్వింటాలుకు 5000 రూపాయలు వ్యవసాయ శాఖ కార్యాలయంలో నగదు చెల్లించచి పల్లీ విత్తనాలు తీసుకెళ్ళాలని సూచించారు. 20 కిలోల పల్లీ విత్తనాల బస్తా ఖరీదు 1000 రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ, రాంపూర్ గురుదొట్ల గ్రామాల రైతులు పాల్గొన్నారు.