ఈదురు గాలులతో భారీ వర్షంతో ప్రజలకు ఇక్కట్లు.. అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి : రఘునాథ్ యాదవ

Published: Thursday July 14, 2022

ప్రజా పాలన, -శేరిలింగంపల్లి, /జూలై 13 : గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. బుధవారం గచ్చిబౌలి టెలీకామ్ నగర్ లో ఈదురు గాలులతో భారీ వర్షం కురువడంతో భారీ చెట్లు విరిగి గుడిసెలపై పడ్డాయి. దీంతో ఆ ఇల్లు కొలిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానిక రాష్ట్ర బీజేవైఎం నాయకులు, కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ వారిని పరామర్శించి భోజన సదుపాయాలు కల్పించారు. జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించి వారికి సహాయం అందించాలని ఒకపక్క డ్రైనేజ్ లు పొంగి కాలనీలు మునిగిపోతుంటే మరొక పక్క ఈదురు గాలులకు చెట్లు విరిగి పడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి లోని టెలీకామ్ నగర్ కాలనీలో ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న గాలివానకు చెట్లు విరిగి పడ్డాయని అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వినర్ అమర్నాథ్ యాదవ్, బీజేపీ నాయకులు రమేష్ రెడ్డీ, దన్ను యాదవ్, మణికంఠ, ఝాన్ , వెంకట్, నాని తదితరులు పాల్గొన్నారు.