ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జెడ్పీటీసీ

Published: Wednesday October 06, 2021
కోరుట్ల, అక్టోబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని మాదాపూర్ గ్రామంలో కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ అడపడచులకు ప్రభుత్వం అందించే అడపడచు కానుక బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కోరుట్ల మండల జెడ్పీటీసీ సభ్యురాలు దారిషేట్టి లావణ్య రాజేష్ చేతుల మీదుగా అదపడచులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు మాదాపూర్ గ్రామ సర్పంచ్ దారిషేట్టి రాజేష్, ఎంపీటీసీ చేపురీ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం మల్లారెడ్డి, పాక్స్ ఛైర్మెన్ గడ్డం ఆదిరెడ్డి, పంచాయితీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యర్తలు, వీఓఏలు పాల్గోన్నారు.