మోడీ చేసిన వ్యాఖ్య లను టిఆర్ఎస్ ఖండిస్తూ మోడీ దృష్టి బొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు

Published: Thursday February 10, 2022
మధిర ఫిబ్రవరి 9 ప్రజా ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు మధిర  వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులుఅంబేద్కర్ సెంటర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధంచేశారు అనంతరం ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనుకుంటూనే ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషం చిమ్ముతున్నారని టిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.. రాష్ట్ర ఏర్పాటు పై రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మధిర మున్సిపాలిటీ పరిధిలో కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ రాజ్యసభలో రాష్ట్ర ఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని దీనితో రాష్ట్ర ఏర్పాటును వారు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో తెలంగాణ ప్రజలకు అర్ధం అవుతోందని కమల్ రాజు తెలిపారు.. బీజేపీ నాయకులు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ పట్ల బీజేపీ పార్టీకి ఉన్న వ్యతిరేకతతో గతంలో జరిగిన ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో కనీస డిపాజిట్లు కూడా రాలేదని ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.. అది నుండి తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేస్తూనే ఉందని, విభజన పద్ధతి ని వ్యతిరేకిస్తున్న మోడీ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకూలమే అని ఉభయ సభల్లో అన్న మాటలను గుర్తు చేసుకోవాలని సూచించారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల వారు మెచ్చుకుంటున్నారని అభివృద్ధిని చూసి ఓర్వలేక అలానే కేంద్రం లో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల కు చేస్తున్న అన్యాయాన్ని కేసీఆర్  ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక మోడీ  విషం చిమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.. గత 7 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఎంటో చెప్పాలని నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే ముందు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. దొండపాట వెంకటేశ్వరావు మార్కెట్ యార్డ్ చైర్మన్  నాగేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు కనుమూరు వెంకటేశ్వరావు అప్పారావు చావా వేణు సొసైటీ అధ్యక్షులు బి ప్రసాద్ నరేందర్ రెడ్డి మొదటి వెంకట్ నారాయణ పి పి ప్రసాద్ హరికి శ్రీను బత్తుల శ్రీను ఓంకార్ మేడికొండ కిరణ్ వెంకన్న వార్డు కౌన్సిలర్ లు అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి