అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు

Published: Wednesday March 17, 2021
మధిర, మార్చి 16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో జరిగిన జయంతి ఉత్సవాలు మధిరలో పొట్టి శ్రీరాములు వారికి ఘనంగా నివాళులు సమర్పించిన ఆర్య వైశ్యులు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో అధ్యక్షులైన కురు వెల్ల కృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ను ఘనంగా జరిపించారు కురువె ల్ల కృష్ణ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తిని అందుకోవాలని తెలిపినారు సత్యాగ్రహం హంస పంటి విధానాలతోనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటం సాధ్యమని విశ్వసించిన గాంధీజీ బాట లోనే పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారు మద్రాసులో 1952 అక్టోబర్ 19న సాంబమూర్తి ఇంట్లో చాలా మామూలుగా ప్రారంభమైన ఆయన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్ష కు మద్దతు సమర్ధించలేదు ప్రజలు శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు ప్రదర్శనలు జరిపారు చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు దీంతో ఆగ్రహం ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు మద్రాసులో జరిగిన అంతిమయాత్రలో ప్రజలు నినాదాలతో ఆయన త్యాగనిరతిని కొనియాడారు తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు హింస చెలరేగాయి చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం కారణంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది తదనంతరం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది  ఆయన పోరాట స్ఫూర్తితో మనమందరం కూడా ఎంతటి ప్రాణత్యాగానికైనా ఐక్యమత్యంతో కృషి చేయాల్సి ఉంది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నా ళ్ల శ్రీనివాస రావు , కోశాధికారి వనమా ఝాన్సీ, పరిపాలన కార్యదర్శి పబ్బతి జగదీష్ మరియు ఆర్యవైశ్యవైశ్య ప్రముఖులు, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం శాశ్వత అధ్యక్షులు రంగా వెంకటేశ్వర రావు, మాజీ కళ్యాణ మండపం అధ్యక్షుడు ఇరుకుల్ల లక్ష్మీనరసింహారావు, పుల్లకండం చంద్రశేఖర్, వనమా సూరి,మాధవ రపు నాగేశ్వరరావు, సముద్రాల లక్ష్మీపతి, మిట్టపల్లి పుల్లారావు, చారు గుండ్ల నరసింహమూర్తి, పల్లపోతు ప్రసాద్, కుంచం కృష్ణారావు, వేములపల్లి విశ్వనాథం, రమేష్, చారు గుండ్ల విజయ్ కుమార్, శ్రీనివాస రావు, కోట రంగారావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, మిర్యాల రమణ గుప్తా, బొగ్గవరపు గణేష్, నేరెళ్ల శ్రీనివాస్, బోనాల నాగేశ్వరరావు, య సాల రాము తదితరులు పాల్గొన్నారు