ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Published: Saturday December 10, 2022
మధిర  డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు  సోనియా గాంధీ  జన్మదిన వేడుకలను శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు* మాట్లాడుతూ
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం, అరవై ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని, ఆకాంక్షను గుర్తించిన  సోనియా గాంధీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆనాడు జాతీయ సలహా కమిటీ యూపీఏ అధ్యక్షురాలు హోదాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ప్రత్యేక గుర్తింపు అథారిటీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టంతో సహా అనేక కీలక చట్టాలు ప్రాజెక్టులను అమలు చేయటంలో సోనియా గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలు సాధించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ ఆశయాలు సాధించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర రెడ్డి సేవాదళ్ అధ్యక్షుడు ఆదూరి శీను నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జహంగీర్ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కోరంపల్లి చంటి కాంగ్రెస్ నాయకులు నిడమనూరు వంశీ కృష్ణ మాజీ సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య కాంగ్రెస్ నాయకులు సంపసాల రామకృష్ణ, అల్లాడి గోపాలరావు, కోటా డేవిడ్, రామారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, మోదుగు బాబు, మైలవరపు చక్రి తదితరులు పాల్గొన్నారు.