బడిబాట కార్యక్రమం లో పాల్గొన్న ఎస్ఎంసి చైర్మన్ గుగులోతు నాగేశ్వరావు

Published: Tuesday June 14, 2022
బోనకల్ ,జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ గుగులోతు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్ మాట్లాడుతూ
నేటి బాలలే రేపటి పౌరులు విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యతని, సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని,తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారని వారు అన్నారు. తల్లిదండ్రుల కోరికలను పిల్లలు కచ్చితంగా నెరవేర్చాలని, అలాగే పిల్లలందరూ ఒక ఆశయం తో చదువుకోని తల్లిదండ్రులకు, చదువు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. అనంతరం ఎస్ఎంసి చైర్మన్ నాగేశ్వరరావు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.