ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడి గా పి శివకుమార్ నియామకం

Published: Monday October 04, 2021
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి : అఖిల భారత విద్యార్థి సమాఖ్య( AISF)  ఏ ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం రాజేంద్రనగర్ లోని ఎ ఆర్. దేవరాజ్ భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య, ఏ ఎస్ ఎఫ్ ఐ నిర్మాణ భాద్యులు పానుగంటి పర్వతాలు పాల్గొన్నారు. అనంతరం నూతన AISF జిల్లా అధ్యక్షులు గా పి.శివకుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పి.శివకుమార్ మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న లక్నో యూనివర్సిటీ లో ఏ ఎస్ ఎఫ్ ఐ ఏర్పడిందని, అప్పటి స్వాతంత్ర్య ఉద్యమం మొదలుకొని నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అనేక క్రియాశీల ఉద్యమాలు నిర్వహించిదని అన్నారు. ఈ దేశంలో ఎంతో మంది విద్యార్థులను రాజకీయంగా, మేధావులుగా, ఉన్నతంగా తీర్చిదిద్దిందని తెలియచేసారు. తను ఇంటర్, ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తునే అనేక విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశానని, ప్రస్తుతం ఎంటెక్ విద్యను చదువుతున్నానని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హాస్టల్ సమస్యల పై, ఫీజు రియంబర్స్ మెంట్, వసతి గృహాల, నూతన పాఠశాల భవనాల సమస్యల వంటి అనేక పోరాటాలలో పాలుపంచుకున్న తెలిపారు. ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు నిరాశ కు గురౌ వుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేట్ కళాశాల లు ఆన్లైన్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేశారని, ప్రభుత్వ కాలేజీలలో మాత్రం ఆన్లైన్ క్లాస్ లు జరగలేదని, కానీ ఇప్పుడు ఇంటర్ పరీక్షలు పెట్టడం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.  పెండింగులో ఉన్న ఫీజురియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంగా ఐటిఐ కాలేజి ని ఏర్పాటు చేయాలని అన్నారు. కులాలు, మతాలు  ఇవేవీ కూడా మనుషులకు శాశ్వతం కాదని, అంటరానితనం పోగొట్టాలని, నిరంతరం విద్యార్థి సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్థానని, ఒక మాములు కార్యకర్త స్థాయి నుండి జిల్లా అధ్యక్షుని స్థాయి వరకు ఎదిగేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియచేస్తూ, రానున్న రోజుల్లో విద్యార్థులను సంఘటిత పరిచి (AISF,) ఏ ఐ ఎస్ ఎఫ్ సంఘాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.