దళితబందులో రాజకీయ జోక్యం ఆరికట్టాలి అధికారుల ద్వారా దళిత బంధు ఎంపిక చేయాలి

Published: Thursday July 07, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి మున్సిపల్ గారికి కేవీపీస్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి -కెవిపిఎస్ మున్సిపల్ కార్యదర్శి ఈ. వీరేశం   మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ధళితబందు  ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రుల చేతుల్లో పెట్టి అర్హులైన నిరుపేద లకు అన్యాయం చేస్తుందని ఈ పథకంలో రాజకీయ జోక్యాన్ని అరికట్టి అధికారులద్వారా దళితులందరి సమక్షంలో ఎంపిక చేయాలని కెవిపిఎస్ మున్సిపల్ కార్యదర్శి ఈ. వీరేశం  డిమాండ్ చేశారు
మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కెవిపిఎస్ ఆధ్వర్యములో భారీ దరఖాస్తులు చేయించడం జరిగింది.మున్సిపల్ దళితులు అందరికి దళిత బంధు ఇవ్వాలని
పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ధళితబందుకు సరిపడు నిధులు కేటాయించకుండాఅందరికి దళిత బంధు ఎలా ఇస్తారని విమర్శించారు రాష్ట్రంలో18లక్షల కుటుంబాలుండగా ప్రభుత్వం ఇప్పుడు నియోజకవర్గానికి కేవలం100మందికి మాత్రమే ఇస్తే ఈ పతకం లక్ష్యం నెరవేరదని చెప్పారు. మున్సిపల్ లో ఉన్నటువంటి అర్హులైన దళితులను గుర్తించి దళిత బందు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సిహెచ్ . ఎల్లేష, సిఐటియు కన్వీనర్,  సిఐటియు ప్ నాయకులు యాదగిరి, శ్రీనికాంత్, ఎం. నర్సింహా,బుగ్గయ్య, మల్లేష్,సురేష్,మురళి, బాలరాజు. వి. యాదయ్య, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.