మంచినీటి సమస్యలను పరిష్కరించాలని వినతి

Published: Wednesday April 27, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) బీజేపీ ఆధ్వర్యంలో మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లలో మంచినీటి సమస్య చాలా అధ్వానంగా ఉందని, జలమండలి కమిషనర్ దానకిషోర్ కు తెలుపుదామని కార్పొరేటర్లు వెళితే కమీషనర్ లేకపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. డివిజన్లలో ప్రధాన సమస్యలు మంచినీటిలో మురుగునీరు కలవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజి సమస్యచాలా తీవ్రంగా ఉందని, మంచినీళ్లు చాలా తక్కువగా రావడం, వచ్చిన ప్రెజర్ రాకపోవడం వంటి ప్రజల సమస్యలను కమిషనర్ దాన కిషోర్ కు తెలియ పరచుటకు వస్తే  కమిషనర్ లేకపోవడం విచారకరమని, ఇప్పటికైన అధికార యంత్రాగం ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేసే విధంగా కమిషనర్ చర్యలు చేపట్టాలని  జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణకు హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్, రామంతాపుర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు వినతి పత్రం అందజేశారు.