వార్డు సమస్యల్ని పరిష్కరించండి మునిసిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన ప్రజలు

Published: Thursday November 10, 2022
బెల్లంపల్లి నవంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: వార్డు కౌన్సిలర్ ఎలాగూ పట్టించుకోవడం లేదని,  మీరైనా మా వార్డు సమస్యలను పరిష్కరించాలని బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కు 18 వ వార్డు ప్రజలు బుధవారం తన చాంబర్లో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
 బెల్లంపల్లి పట్టణం లోని 18 .వ వార్డు కాంట్రాక్టర్ బస్తి,  
 బెల్లంపల్లి పట్టణంలో అతి పురాతన  వార్డు అని,  పట్టణ నడి బొడ్డున ఉన్న కమర్షియల్ వార్డని, బస్తీ ప్రజలు అన్ని వార్డుల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తూ ఉంటామని, కానీ వార్డులో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎన్నో అవస్థలకు గురవుతున్నామని వారు వాపోయారు.
 వార్డు కౌన్సిలర్ కు  సమస్యలపై ఎన్నిసార్లు చెప్పినా  పట్టించుకోవడం లేదని, విధి లేని పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం కోసం
 మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతిపత్రం అందజేశామని, వార్డును సందర్శించి, సమస్యలను  పరిష్కరించాలని కోరామని అన్నారు.
కమిషనర్ వెంకటేష్, సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరలో వార్డులో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాననీ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కన్నయ్య సింగ్, సిరికొండ కనకయ్య, వార్డు ముఖ్య నాయకులు కొలిపాక శ్రీనివాస్, రాచర్ల సంతోష్ కుమార్, కొత్తపల్లి శ్రీధర్, అంతరగిరి రవి, గర్రెపల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.