ఉలిక్కిపడ్డ మాటూరు

Published: Monday July 05, 2021
జులై 4 హైదరాబాద్ ప్రజాపాలన : చాప కింద నీరులా సందెపల్లి క్రాంతికుమార్ మాఫియా దందా ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. కొంతమంది మిత్రులతో జట్టుగా ఏర్పడి హైదరాబాద్ ను అడ్డాగచేసుకొని నయా దందాలు, బెధిరింపులు, భూకబ్జాలు ఇలా ఒక్కొక్కటి  వెలుగులోకి వస్తున్నాయి. యాదాద్రి- భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన సందెపల్లి క్రాంతికుమార్, సందెపల్లి సింహార్దిని పలు నేరారోపణలకింద అరెస్టు చేశారనే వార్త తెలియడంతో మాటూరు గ్రామం ఒక్క సారి ఉలిక్కి పడ్డది. ఎంతో ప్రశాంతంగా ఉండే మాటూరు గ్రామం ఒక్కసారిగా ఇలా వార్తలోకి వచ్చినది. మాటూరు గ్రామం ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మాఫియా వలలో పడి మోసపోయిన వారెందరో ఉన్నారని చుట్టుపక్క గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. వీరి కార్యకలాపాలు ఒక్కక్కటిగా పోలీసులు వెలుగులోకి తీస్తారని బాధితులు ఆశిస్తున్నారు.