శంకరపట్నంలో ఘనంగా శివరాత్రి మహోత్సవం. శంకరపట్నం ఫిబ్రవరి ప్రజా పాలన రిపోర్టర్:

Published: Monday February 20, 2023

  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండలంలోని అన్ని శివాలయాలు వేకువ జామునుండే  భక్తులతో కిక్కిరిసాయి. మండలంలోని చింతలపల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  హాజరయ్యారు.  ఆలయ పూజారి హరికృష్ణ అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందించారు.  ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నిమ్మచెట్టు తిరుపతి  ఎమ్మెల్యేను శాలువాద సత్కరించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు  ఏనుగుల అనిల్, ఆలయ  డైరెక్టర్లు  మోతే సమ్మయ్య మునిగంటి మహేష్ పల్లా తిరుపతి బోయిని రాజయ్య మునిగంటి తిరుపతి కే శ్రీనివాస్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పల్లె మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.