వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి దంపతులు

Published: Friday February 11, 2022
బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం రాయనపేట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు సునీల్ బాబు కుమార్తె ప్రత్యూష వివాహ వేడుకకు భట్టి విక్రమార్క దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, కలకోట సొసైటీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మరుపల్లి ప్రేమ్ కుమార్, కలకోట సొసైటీ డైరెక్టర్ కొంగర రామారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చావా నాగేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.