జాతీయ కార్మిక సంఘాలు మెరుగైన వేతన ఒప్పందం సాధించాలి. ......మల్రాజు శ్రీనివాసరావు

Published: Saturday August 27, 2022
బెల్లంపల్లి, ఆగస్టు 26 , ప్రజా పాలన ప్రతినిధి: 
 
 సింగరేణి కార్మికులకు జాతీయ కార్మిక సంఘాలు అనే చెప్పుకునే సంఘాలు ఇప్పటికైనా మెరుగైన వేతన ఒప్పందం సాధించాలని, ఒప్పందకాల పరిమితి దాటి 14 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా జాతీయ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కార్మికులకు ద్రోహం చేయడమే అని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాసరావు అన్నారు.
శుక్రవారం నాడు కైరిగూడ ఓసీపీలో జరిగిన ద్వార సమావేశంలో ఆయన మాట్లాడారు,
 సెప్టెంబర్ లో జరగబోయే వేతన సవరణ  సమావేశంలో నైన జాతీయ సంఘాలు మెరుగైన వేతనం ఒప్పందం సాధించుకు రావాలని అన్నారు. దేశంలోని ఈ బొగ్గు సంస్థలో లేనటువంటి అనేక హక్కులను టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ వచ్చిన తర్వాతనే అనేక హక్కులను సాధించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో   టీబీజీకేఎస్ ఖైరిగూడ  ఫిట్ కార్యదర్శి కార్నాథం  వెంకటేశం, కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి  సంఘంప్రకాష్ రావు, 11 మెన్ కమిటీ సభ్యులు ధరావత్ మంగీలాల్ , అంజయ్య ,జిఎం కమిటీ సభ్యులు గజెల్లీ చంద్రశేఖర్, మారిన వెంకటేశ్వర్లు ,కోగిలాల  రవిందర్, అదనపు ఫిట్ కార్యదర్శులు మాసాడి నారాయణ, భాస్కరాచారి,బొంగు వెంకటేష్, ఖైతే స్వామి,సేఫ్టీ కమిటీ ,మైన్స్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు  అన్నం లక్ష్మయ్య, ఈపి ఆపరేటర్స్,  తదితరులు పాల్గొన్నారు.