బస్టాండ్ సౌకర్యం కల్పించండి.. బిఎస్పి..

Published: Tuesday May 04, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రజాపాలన : జూలూరుపాడు మండలం వైరా నియోజకవర్గం, మరియు ఎమ్మెల్యే రాములు నాయక్ స్వగ్రామం ఐనా మండల కేంద్రానికి బస్టాండ్ లేక ప్రజలు ఎన్నోరకాల ఇబ్బందులకు గురవుతున్నారు, భద్రాచలానికి కేంద్రానికి 60 కిలోమీటర్లు దూరం, ఖమ్మం నగరానికి 60కిలోమీటర్లు దూరం ప్రధాన రహదారికి మధ్యలో నిత్యం ప్రజలు ఎన్నోరకాలుగా వారి అవసరల నిమిత్తం ప్రయాణం చేస్తుంటారు, నిలవ నీడలేక ఎండను సైతం లెక్క చేయకుండా ప్రధాన రహదారులు వెంట నిలుచొని బస్సులకోసం ఎదుచూస్తూ ఎన్నో అవస్తలు పడుతున్నారు, మహిళలు ముసలి వాళ్ళు నీడ కోసం పక్కనే వున్న షాపులలో నిలుచునదామంటే కరోనా వలన వారుకూడ షాపుల్లో రానియని పరిస్థితులు కనబడుతున్నాయి, గతంలో వున్న బస్టాండ్ రోడ్డు విస్తరణ లో కూల్చి అధికారులు వారి పనులు సజావుగా చేసుకొని వెళ్లిపోయారు, ప్రజల కష్టాలను పట్టించుకోక అధికారులు ప్రజా ప్రతి నిధులు నిమ్మకు నీరేతినట్టు వ్యవహరించిన తీరు బాధా కారమణి జూలూరుపాడు మండల బిఎస్ పి పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు అధికారులు లు కోరుతూ ప్రజల కోసం బస్టాండ్ నిర్మించాలని డిమాండ్ చేసారు