ఎమ్మెల్యే ఫైళ్ల జన్మదిన వేడుకలు

Published: Wednesday August 11, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ఆగస్టు 10 మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుజల దాత భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.సి.సి విద్యార్థులకు మాస్కులు శానిటైసర్లు అందజేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. సాయిబాబా మరియు పెద్దమ్మతల్లి దేవాలయలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సోమనబోయిన సతీష్ సహకారంతో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పది కాలాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు పొంది నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండుయాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కునపూరి కవిత రాములు, పిఎసియస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ మమతనరేందర్ రెడ్డి, మాజీ ఎంపిపి నాగరాజు, సర్పంచులు గూడూరు శివశాంత్ రెడ్డి, మద్దెల మంజులనాగరాజు, పసల అన్నామేరీ శౌరి, వంగాల భిక్షపతి, నర్సింహ, ఎంపిటిసిలు పలసం రమేష్, నోముల మల్లేశ్, మోటే నర్సింహ, తుమ్మల వెంకట్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు రవీంద్ర, మార్కెట్ డైరెక్టర్ లు పోలేపాక సత్యనారాయణ, ఎలిమినేటి సత్యనారాయణ, సంజీవరెడ్డి, దేవస్థానం డైరెక్టర్ లు పోలేపాక భిక్షపతి, శ్రీనివాస్, శేఖర్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు తక్కిళ్ళ సంజీవ,యూత్ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాంతికుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు అయిటిపాముల ప్రభాకర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సలీం, నాయకులు సత్యనారాయణ, దనుంజయ, లింగస్వామి, శ్రీ ధర్ రెడ్డి, మల్లేశ్, కలుకురి రాములు, సురేష్, రాజు, యదగిరి తదితరులు పాల్గొన్నారు.