రైతులకు ఇబ్బందులు లేకుండ వరిదాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి : జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసుర

Published: Tuesday May 18, 2021
జగిత్యాల, మే 17, ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ జిల్లా అధికారులతో వరిదాన్యం కొనుగోళ్ల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు కష్టపడి పంటను సాగుచేసి ధాన్యం చేతికి వచ్చే సందర్బంలో అకాల వర్షాల వలన రైతుల ధాన్యానికి నష్టం కలుగకుండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు ముమ్మరం చేసి మిల్లర్ మరియు లారీల యాజమాన్యంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధాన్యం తడిసిపోకుండ గమ్యస్థానానికి చేరేల తగుచర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి రైతులకు అన్నివిధాల సౌకర్యాలను కల్పిస్తూ రైతులకు అండగా వుంటూ రైతులు అధిక దిగుబడులను పొంది పంటల ద్వారా లాభం చేకూర్చే మార్గదర్శకం చేయడం మరియు రైతులు పండించిన ప్రతి ధాన్యంగింజను కొనుగోలు చేయుటకు నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని గత 60 సంవత్సరాల పాలనలో జరగనిది కేవలం 6 సంవత్సరాలలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పేద ప్రజల శ్రేయస్సు కొరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని అధికారులు రైతుల ధాన్యమును కొనుగోలు చేయుటకు పూర్తి సహాయ సహకరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సంధ్యారాణి డిఆర్డివో వినోద్ డిసిఓ రామనుజచార్యులు డిఏఓ సురేష్ కుమార్ డిసిఎస్ఓ చందన కుమార్ డిఎంసిఎస్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.