చెరువులను కుదింపు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

Published: Monday July 19, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : చెరువులను విస్తీర్ణం పెంచకుండా, కుదింపు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి అధ్యర్యంలో అల్మాస్ గూడ లోని నల్ల కుంట, పోచమ్మ కుంట చెరువులను ఆదివారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు డిసిసి అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నేత దేప భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..... స్థానిక మంత్రి సభితా ఇంద్రారెడ్డి  చెరువుల సుందరికరణల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గొలుసుకట్టు చెరువులను కుదింపు చేస్తున్నారు, వెంటనే ఈ చెరువులను విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెంచని ఎడల కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.... చెరువులను సుందరీకరణలో భాగంగా  స్థానిక లీడర్ల మాట వింటూ... స్థానిక ఎమ్మెల్యే, ప్రజలు, కాలనీవాసుల వారి బాధలు అర్థం చేసుకోవడం లేదని మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ వాపోతున్నారు. వర్షాకాలంలో గతంలో ఉన్న చెరువుల విస్తీర్ణత కుదింపు వల్ల సుందరీకరణ ఏమో కానీ, ముంపు ప్రాంతాలు ఎక్కువగా కనబడతాయని మంత్రి ఆలోచించడం లేదని కాంగ్రెస్ నేతలందరూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్,  ఏ. జంగారెడ్డి, సత్యనారాయణ, నవారు మల్లారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నల్లేంటి ధనరాజ్ గౌడ్, నరేందర్, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్  ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, ఎన్ ఎస్ యు ఐ విష్ణు వర్ధన్ రెడ్డి, రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.