టిఆర్ఎస్ నుండి గెలిచిన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ఏం చేశారని డిమాండ్

Published: Friday September 30, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): ఎలక్షన్ ఉన్నాయంటే వచ్చే కూసుకుంట్ల కన్నా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపే దేవలమ్మ నాగారం ప్రజలు మొగ్గు చూపుతారని గ్రామ భాజపా నాయకులు వరకాంతం జంగారెడ్డి అన్నారు. గురువారం జంగారెడ్డిని ప్రజా పాలన దినపత్రిక పలకరిస్తే వారు మాట్లాడుతూ. ఎలక్షన్ల ముందు హడావిడి చేసే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలలో కొయ్యలగూడెం నుండి పీపల్ పహాడ్ గ్రామం వరకు రోడ్డు నిర్మాణం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ప్రజల కోసం, మునుగోడు ఆత్మగౌరవం కోసం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన బై ఎలక్షన్ సందర్భంగా మరలా దేవలమ్మ నాగారం గ్రామానికి వచ్చిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్ని కుల సంఘాలకు కమిటీ హాల్స్ నిర్మిస్తానని హామీ ఇచ్చారని. ఎలక్షన్ కాకముందుకే కమిటీ హాల్స్ ను నిర్మించి మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెపితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. గ్రామంలో అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే గ్రామ సర్పంచ్ గ్రామపంచాయతీలో కోటి రూపాయల బడ్జెట్ ఉన్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. గ్రామానికి పక్కనే ఉన్న నోష్ ల్యాబ్ పరిశ్రమ నిధులిచ్చి నిర్మిస్తున్న గ్రామపంచాయతీని తానే నిర్మిస్తున్నాం అనడం సిగ్గుచేటు చర్య అన్నారు. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపిస్తూ విమర్శించారు. గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ నీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవ చేశారు. దేవలమ్మ నాగారం ప్రజలు భాజపా పార్టీకి బ్రహ్మరథం పలుకుతున్నారని మునుగోడు బై ఎలక్షన్ లో దేవలమ్మ నాగారం గ్రామంలో 90% ఓట్లు బిజెపికి పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రతిష్టాత్మకమైనదని మునుగోడు గడ్డపై కాషాయపు జెండా ఎగురుతుందని. కెసిఆర్ గడీల రాజ్యాన్ని కూల్చడానికి బాటలు వేస్తుందని అన్నారు.