ఎమ్మార్పీఎస్. మండల కన్వీనర్ వడ్లమూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళి

Published: Tuesday March 02, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 1: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండల పరిధి లోని కోనాయిగూడెం గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన మాదిగ అమరవీరుల దినం ఘనంగా నిర్వహించారు.గ్రామ కమిటీ అధ్యక్షుడు చెరుకుపల్లి రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నేలకొండపల్లి మండల అధ్యక్షుడు వడ్లముడి వెంకటేశ్వర్లు మాదిగ హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్లముడి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం, మాదిగ జాతి  కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాల పునాదుల పైన వర్గీకరణ సాధించి చరిత్ర నిర్మిస్తామని,  వర్గీకరణ సాధించేవరకు అలుపెరగని పోరాటం చేస్తామని  తెలియజేశారు. మాదిగ అమరవీరుల త్యాగాలు మరవబోమని మాదిగ మహిళలు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చెరుకుపల్లి శ్రీనివాసరావు, గ్రామ అధ్యక్షుడు చెరుకుపల్లి రాజేష్, మాజీ గ్రామ అధ్యక్షుడు వడ్లమూడి గురవయ్య, నాగేశ్వరరావు, రాములు, వెంకటేశ్వర్లు, రాంబాబు, ఎల్లయ్య, చెరుకుపల్లి ఉపేందర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు