యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బంగారు గోపురానికి విరాళాలు సేకరణ

Published: Friday October 29, 2021
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం 125 కిలోల బంగారం అవసరమవుతుందని, ఈ బంగారు తాపడం కోసం దాతలు మరియు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలందరినీ యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి  సేవచేసుకొనే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, నాయకులు విరాళాలు సేకరించారు. ప్రజల నుండి సేకరించిన రూ 3లక్షల 15వేల విరాళాలను కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డికి పీర్జాదిగూడ కార్పొరేషన్ కార్పొరేటర్లు మద్ది యుగేంధర్ రెడ్డి, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, బచ్చ రాజు, అమర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బుచ్చి యాదవ్ మరియు పాండుగుప్త అందజేశారు.