రాయికల్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన - మున్సిపల్ చైర్మెన్ మరియు కమిషనర్

Published: Saturday June 04, 2022

రాయికల్, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ఈనెల జూన్ 03 నుండి 18వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమంలో భాగంగా రాయికల్ పట్టణంలోని 12వ వార్డులలో పురపాలక సంఘం చైర్మన్ మోరహనుమాన్లు, కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ పర్యవేక్షణలో అన్ని వార్డులకౌన్సిలర్లతో  ప్రారంభింపజేశారు. కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డులనిర్వహణసభకు హాజరైన పురపాలక చైర్మన్ మోరహనుమాన్లు, కమిషనర్ సంతోష్ కుమార్ లు, కమిషనర్ మాట్లాడుతూ  తడిచెత్త,పొడిచెత్త సేకరణ, వ్యక్తిగత మరుగుదొడ్లనిర్మాణం మరియు పట్టణపరిశుభ్రత ప్రజల బాధ్యత,భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించారు. అనంతరం 12వ వార్డులో చైర్మన్ మాట్లాడుతూ ప్రతిఒక్క వార్డుకౌన్సిలర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగాప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో తిరిగి అన్ని సమస్యలను గుర్తించాలని ముఖ్యంగా త్రాగునీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా పనిచేయాలని, 15 రోజులపాటు వార్డులోని వివిధ ప్రాంతాల్లో చేయాల్సిన పారిశుద్ధ్య పనుల జాబితా తయారు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మేనేజర్ వెంకట్, వార్డు ఇంచార్జ్ మచ్చసుదర్శన్ సురేష్, కార్యాలయ సిబ్బంది గంగనరసయ్య,అంగన్వాడీ టీచర్లు, వార్డుకమిటీలు ఆర్.పి.లు, వార్డుప్రజలు పాల్గొన్నారు.