టీ.ఆర్.ఎస్ గెలుపు మునుగోడు అభివృద్ధి కి మలుపు.

Published: Wednesday October 26, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి):
 మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట్, దండుమల్కాపూర్, ఖైతాపూర్ మరియు యల్లగిరి గ్రామాలలో టీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
 సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలు బలపరిచిన టీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా.గ్రామస్తులు,మహిళలు బతుకమ్మలు,బోనాలు ఎత్తుకొని, కోలాటాలతో మంగళహారతులు పట్టి, బొట్టుపెట్టి ఘన స్వాగతం పలికినారు. గ్రామ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించినారు.టీ.ఆర్.ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల కు శాలువాలతో సన్మానించారు. యాదవ సోదరులు గొంగిడి కప్పి గొర్రెపిల్ల ను బహుకరించినారు. అభ్యర్థి కి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన సందర్బంగా ప్రచారానికి తరలివచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యులు మాట్లాడారు.జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశం అంతా అడుగుతుంటే మోడీ కాళ్ళ కింద మట్టి కదులుతుందన్నారు.
అందుకే కేసీఆర్ పై మోడీ కక్ష పెట్టుకున్నాడని తన పీఠం కదులుతుందనే మోడీ కుట్ర పూరితంగా మునుగోడు కు ఎన్నికలు తెచ్చారన్నారు.
నీతి అయోగ్ చెప్పినా ఒక్క రూపాయి ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
మునుగోడులో కారు గుర్తు కు ఓటేసి బీజేపీ కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ప్రజలను కోరారు.
మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, లక్షల కోట్లతో చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలకు తమ వాటా క్రింద ఒక్క రూపాయి ఇవ్వడం చేతకానీ మోడీ కి తెలంగాణ లో ఉప ఎన్నిక తీసుకురావడానికి, రాజగోపాల్ రెడ్డి ని కొనడానికి మాత్రం 18వేల కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. మునుగోడు టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు తెలుసు ఎంతకు అమ్ముడు పోయాడో కూడా తెలిసిపోయింది.
18 వేల కోట్ల రూపాయలకు మునుగోడు తాకట్టు పెట్టినవ్
2014 నుండి 2018 వరకు నియోజకవర్గం ను అభివృద్ధి చేసుకున్నాం..
చౌటుప్పల్ లో మిషన్ భగీరథ పైలాన్ నిర్మించుకొని, ఇంటింటికి నల్లాలు ఇచ్చి త్రాగునీరు కొరత తీర్చినం.
గతంలో 2014 లో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చౌటుప్పల్ పరిధిలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మాణం చేసిన
 ఖైతాపూర్ ను కొత్త గ్రామ పంచాయతీ గా.చేసిన 
దండు మల్కాపూర్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను తీసేపించాను.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో యువత ఉద్యోగాల కోసం చౌటుప్పల్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది.
రాజగోపాల్ రెడ్డి 2018లో గెలిచి, తూప్రాన్ పేట లో ఒక్క పని కూడా చేయలేదు..
రాజ గోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఏ ఊరు సరిగ్గా తెలియదు,ఎక్కడ తిరగలేదు ఏం పని చేయలేదు.
దేశంలో ఎక్కడైనా ఒక ప్రజా ప్రతినిధి చనిపోతే ఉప ఎన్నిక వస్తే, మునుగోడులో మాత్రం అమ్ముడు పోవడం ద్వారా ఉప ఎన్నిక వచ్చింది.
కాంట్రాక్టు డబ్బు కోసం అమ్ముడు పోయిన దొంగ గోల్ మాల్ గోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి రాజీనామా మునుగోడు ప్రజల కోసం కాదు,తన కోసం, తన కుటుంబ స్వార్థం, అభివృద్ధి కోసమే.. 
నవంబర్ 3న జరుగబోయే ఉప ఎన్నికలో పోటీ రాజగోపాల్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్యే జరుగుతుంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
డబ్బును నమ్ముకుని రాజకీయం చేసేది బిజెపి అయితే, చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు చెప్పి రాజకీయం చేసేది టీ.ఆర్.ఎస్ పార్టీ.
గోల్ మాల్ గోపాల్ ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు..తస్మాత్ జాగ్రత్త ఆయనను నమ్మొద్దు.
సుమారు 600 కోట్ల రూపాయల నిధులు తెచ్చి రోడ్లన్నీ మంచిగా చేసుకున్నాము.మండల కేంద్రాలకు నూతన రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది.
దాదాపు రూ.2000 కోట్లతో చెర్లగూడెం, లక్ష్మనాపురం రిజర్వాయర్లు నిర్మాణం పనులు చేసుకుంటున్నాము. పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నాము.
అందుకే మీ బిడ్దగా ఈ ప్రాంత వాసిగా అడుగుతున్న నన్ను ఆశీర్వదించండి.అభివృద్ధి చేసుకుందాం.
నన్ను గెలిపిస్తే మునుగోడులో ఆగిపోయిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో ముందుకు నడిపిస్తాను.
నేను మీ ఊరి బిడ్డ ను, మీ ప్రాంత వాసిగా అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి మీ సేవకుడిగా పనిచేస్తాను అన్నారు.ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న: జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,మరియు సిపిఎం నాయకులు చెరుకుపల్లి సీతారాములు,సీపీఐ కార్యదర్శి శ్రీరాములు, TRS నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ మరియు మండల, గ్రామ స్థానిక ప్రజా ప్రతినిధులు,టీ.ఆర్.ఎస్ ముఖ్య నాయకులు,పార్టీ శ్రేణులు, సీపీఐ, సీపీఎం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.