బహుజన్ సమాజ్ పార్టీ చారిత్రక అవసరం

Published: Thursday December 01, 2022
 ఆధిపత్య వర్గాల పాలనను విముక్తి చేద్దాం
* బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి
* వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజా పాలన : బహుజన్ సమాజ్ పార్టీ చారిత్రక అవసరమని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆధిపత్య వర్గాల పాలనను విముక్తి చేసేందుకు బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త చంద్రశేఖర్ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ యాదవ్ లు బిఎస్ పి జిల్లా అధ్యక్షుడు గొర్ల కాడి క్రాంతి కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ ఇంచార్జ్ పెద్ది అంజయ్యతో కలిసి పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు ఆలంపల్లి దర్గా సమీపంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు జిల్లా పరిధిలోని బీఎస్పీ ముఖ్య కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆలంపల్లి దర్గాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు బీఎస్పీ కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఆలంపల్లి దర్గా నుండి ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలోనే బిఎస్పీ కార్యాలయం వరకు డిజె సౌండ్ కు అనుకూలంగా యువ బీఎస్పీ కార్యకర్తలు నృత్యం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీలో బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఆధిపత్య వర్గాల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతున్నవని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న ఆధిపత్య వర్గాలను సాగనంపాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల జీవితాలను బాగు పరచాలని లక్ష్యం కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపి పార్టీలకు లేదని ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి 103వ సవరణ బిల్లు చేసి అగ్రవర్ణాల రిజర్వేషన్లను 8 శాతం ఉన్న వాటిని 10 శాతానికి పెంచిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీసీలు 50 శాతం ఉన్నవారికి ఎందుకు 27 శాతం రేషన్లు పెంచరని ప్రశ్నించారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 81 శాతం, జార్ఖండ్ ప్రభుత్వం 77 శాతం, తమిళనాడు ప్రభుత్వం 69 శాతం బిసిలకు రిజర్వేషన్లు పెంచగలిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెంచదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఇ. అరుణ్, వికారాబాద్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ రంజోలి నరసమ్మ, జిల్లా ఇన్చార్జి యాదగిరి యాదవ్ తాండూర్ పరిగి కొడంగల్ వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులు వివిధ మండలాల బిఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.