తీజ్ పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించాలి

Published: Saturday September 17, 2022
 సేవాలాల్ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి జటోవత్ రవి నాయక్
వికారాబాద్ బ్యూరో 16 సెప్టెంబర్ ప్రజా పాలన : గిరిజన జాతి ఘనంగా జరుపుకునే తీజ్ ఉత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి జటోవత్ రవి నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సేవాలాల్ బంజారా భవన్ కొమురం భీమ్ భవనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.  తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరారు. గిరిజనులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో గిరిజనుల జనాభా పెరిగిందని దానికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 9.34 శాతం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వారి జనాభా 9.98 శాతంగా పెరిగిందని స్పష్టం చేశారు. సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెనావత్ అజయ్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర  అధికారి ప్రతినిధి జటోవత్ రవి రాష్ట్ర ప్రజా ప్రతినిధి ఫోరం అధ్యక్షుడు జతోవత్ శంకర్ నాయక్ , కిషన్ మహారాజు కౌన్సిలర్ ఆర్ చందర్ నాయక్ జేఏసీ గంగ్యా నాయక్, శ్రావణ్ నాయక్, బాబ్యా నాయక్ ఉప సర్పంచ్ తులసి రామ్ రాజు నాయక్ గోపాల్ చవాన్ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 
 
 
Attachments area