ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి * *నామినేటెడ్ పోస్టులల్లో వికలాంగులకు రిజ్

Published: Thursday February 23, 2023

ఎన్ పి ఆర్ డి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం లో  జెండా ఆవిష్కరణ*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్షం చేస్తున్నాయని, నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆత్మ గౌరవం, హక్కుల సాధన కోసం వికలాంగులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని  ఎన్.పి.ఆర్.డి జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు పిలుపునిచ్చారు. ఎన్ పి ఆర్ డి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం లో సాగర్ హైవే పై కట్ట మీద జెండా ఆవిష్కరణ జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఆత్మ గౌరవం, హక్కుల సాధన లక్ష్యాలతో ఏర్పడి దేశ వ్యాపితంగా ఉద్యమాలు చేస్తుందని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం వికలాంగులను ఐక్యం చేస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు జిల్లా వ్వాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు ముగింపుగా హైదరాబాదులో ఫిబ్రవరి 28 నాడు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన 13 ఏండ్ల కాలంలో వికలాంగుల సంక్షేమం కోసం పాలకుల విధానాలపై ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర సంఘానికి ఉందని అన్నారు.2016 ఆర్ పి డి చట్టం,, ఆర్ సి ఐ  మానసిక వికలాంగుల చట్టం వంటి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైల్వేలో సౌకర్యాల కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తామని తెలిపారు.వికలాంగులకు చేయూత నివ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. బ్యాక్ లాక్ పోస్టుల భర్తీ కోసం ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు. మహిళా వికలాంగులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. మహిళా వికలాంగులపై అత్యాచారాలు దాడులు జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.8 ఏండ్ల మోడీ పాలనలో వికలాంగుల హక్కులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించిన ఖర్చు ఎందుకు చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నరాని వారి కుటుంబల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10000 పెంచాలని డిమాండ్ చేశారు. సామూహిక ప్రాంతాలన్నీ మార్చడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవేవీ వికలాంగులకు దక్కడం లేదని విమర్శించారు వికలాంగుల ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని అన్నారు రోస్టర్ పాయింట్లలో వికలాంగులకు 10 లోపు మార్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పిల్లల మర్రి ప్రభాకర్ జిల్లా మహిళా విభాగం కన్వ్వినార్ తాళ్ళ నిర్మల   ఎన్ పి ఆర్ డి నాయకులు బస్సు పాండురంగారెడ్డి గణేష్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.