గోవులను రక్షించండి, నాగరికతను కాపాడండి మంచిర్యాల జిల్లా గో సంరక్షణ సమితి అధ్యక్షులు గోలి శ

Published: Tuesday September 20, 2022

బెల్లంపల్లి సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: అంతరించిపోతున్న గోవుల వంశాన్ని రక్షించే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరు చాలెంజిగా తీసుకోని గోవులను రక్షించాలని మంచిర్యాల జిల్లా గోసంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు గోలి శ్రీనివాస్ అన్నారు.

విశ్వ హిందూ పరిషత్ అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాదులో నిర్వహించిన జాతీయ గోరక్షణ ఆందోళన శిక్షణ సమావేశం లో పాల్గొని వచ్చిన ఆయన సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు, అంతరించి పోతున్న గోవంశాన్ని సంరక్షించే భాద్యత, ప్రతి ఒక పౌరునిపై ఉందని, గోమాంస వినియోగానీ నిరోధించి, గోవుల అక్రమ రవాణాను అడ్డుకుని గోమాత లను కాపాడే బాధ్యత సమాజంలో ని ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు, గోవులను రక్షించకపోతే రాబోయే తరాలకు విలువలు తో కూడుకున్న నాగరికత ఉండదని, కృత్రిమ పాలకు,ఆహార పదార్థాలను అందించాల్సి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్త చేశారు.

నాగరికత మొదలైన నాటి నుండి ఇప్పటివరకు గోమాత నే మన జీవన విధానంలో విశిష్ట పాత్ర పోషిస్తుందని, ప్రపంచ జీవన మనుగడలో భాగంగా మనల్ని రక్షించే గోమాతలను కాపాడుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు, ప్రకృతి లో మమేకం ఐన గోమాత లేకుంటే ప్రకృతి కూడా మనకు సహకరించదని గుర్తుచేశారు.