కరోనా మహమ్మారి కాటుకు కుప్పలు కుప్పలుగా కాటికి చేరుతున్న శవాలు పట్టించుకోని ప్రభుత్వాలు : ఎ

Published: Tuesday May 11, 2021
జిన్నారం, మే 10, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా మహమ్మారి బారిన పడి జనాలు పిట్టల్లా రాలి పోతుంటే ప్రభుత్వాలు  ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ అన్నారు, ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారి కాటుకు కుప్పలు కుప్పలుగా కాటికి శవాలు చేరుతుంటే, కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వలు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని, కరోనా వైరస్ బారినపడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటు, ఎన్నో కుటుంబాలలో ముగ్గురు, నరుగురు మృత్యువాత పడుతున్న  ప్రభుత్వలలో చలనం లేదని, కరోనా కట్టడికి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు, అదేవిధంగా ప్రజలాందరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి శానిటైజర్ లు వాడుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా తమని తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉందని, ప్రజలకు ఇల్లే శ్రీ రామ రక్షని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్లు లేవు, పరీక్షా కిట్లు అవసరానికి తగ్గట్టుగా లేకపోవడం గమనార్హమని, ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే పరీక్షా కిట్లు ఎన్ని తగ్గిస్తే అన్ని కేసులను తక్కువగా చూపించుకో వచ్చన్న దురుద్దేశంతో కిట్లు కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన ఎద్దేవాచేశారు
Attachments are