ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య

Published: Friday July 29, 2022

మధిర  జులై 28 ప్రజాపాలన ప్రతినిధి  ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని సర్పంచ్ నండ్రు సుశీల పేర్కొన్నారు గురువారం మండల పరిధిలోని రాయపట్నం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు గంట సత్యం సరోజినీ జ్ఞాపకార్థం రజిని రామనందం ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన  నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గంట సత్యం సరోజినీ జ్ఞాపకార్థం గత పది సంవత్సరాలు నుండి విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు, పెన్సిల్లు రబ్బర్లు విద్యార్థులకు ఉపయోగపడే లక్ష రూపాయలు విలువచేసే వస్తువులను అందించటం అభినందనీ మన్నారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి దాతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి ఎస్ఎంసి చైర్మన్ విజయ్ కుమారి ఉపాధ్యాయులు సాంబశివరావు అజయ్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, విశ్వనాథం,  ఎస్ఎంసి సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.