మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 21వేలకు పెంచాలి

Published: Monday April 10, 2023

-కార్మికుల సమస్యలు పరిష్కరించి.

- 5 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్.

  -సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్.

చేవెళ్ల ఏప్రిల్ 9, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజవర్గంలోని శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ శంకర్ పల్లి పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నరని అన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీసం గ్లౌజ్ లు, బుట్లు, గుర్తింపు కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కార్మికులకు వాటితో పాటు, నాణ్యమైన సబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూ,,ల జీతం, 5 లక్షల భీమా ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని యెడల తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బిసొల్ల రమేష్, కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు శాంతయ్య, కృష్ణ, మున్సిపల్ కార్మికులు లక్ష్మీ, రాజు,.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.