ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే సంజయ్

Published: Thursday October 07, 2021
జగిత్యాల, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ పావని కంటి ఆసుపత్రిలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 21 మందికి మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసినారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, యూత్ నాయకులు ఆర్షద్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.