పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నెలవారి సమీక్ష సమావేశంలో ** జిల్లా ఎస్పి సురేష్ కుమార్ ** పోలీస్ స్

Published: Thursday September 22, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 21 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్,ఆసిఫాబాద్, కాగజ్నగర్, డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ కొరకు డీఎస్పీలు, సీఐ లతో, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ సి. సి. టి. ఎన్.ఎస్, (క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిష్టం) యందు పోలీస్ స్టేషన్ లోని ఎఫ్. ఐ. ఆర్, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అండర్  ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తిచేయాలని, గ్రామాలలో సదస్సులు నిర్వహించాలని, అలవాటుపడిన నేరస్తుల పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు. చిన్న నేరాలు కూడా జరగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థ పటిష్టం పర్చాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్,బి, డబ్ల్యూ,లపై ప్రత్యేక టీమ్స్ ఏర్పాటుచేసి ఎగ్జిక్యూట్ గురించి సూచించారు. కోర్టులలో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మహిళల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి  భద్రత విషయంలో ఎల్లప్పుడూ సహకారం అందించారని తెలిపారు. ఫిర్యాదులపై త్వరగా చర్యలు తీసుకొని బాధితులకు భరోసా కల్పించాలని, పోలీసు ప్రతిభ  పెరిగేలా సిబ్బంది పని చేయాలని సూచించారు.
 అనంతరం చివరి సంవత్సరం కరోనా సోకిన 25 మంది హోంగార్డ్స్ కి రూ 5000 నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర్ రావ్, భీమ్రావు, డిఎస్పి లు శ్రీనివాస్, కరుణాకర్, సిబ్బంది  పాల్గొన్నారు.