కెవిపిఎస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్

Published: Saturday February 04, 2023
మంచిర్యాల , ఫిబ్రవరి 03, ప్రజాపాలన.
 
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ -2023 నూతన క్యాలెండర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఈడీ దుర్గ ప్రసాద్  మాట్లాడుతూ సమాజంలో అసమానతలు పోవాలని కుల నిర్మూలన జరగాలని అహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, కొమురం భీం, సాహు మహారాజ్, కారల్ మార్క్స్, నెల్సన్ మండేల  చిత్రాలను క్యాలెండర్లో ముద్రించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్లకి ఇస్తానన్నటువంటి దళిత బంధు , డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇడ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇచ్చి సొంతింటి చిరకాల కలను నెరవేర్చాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇల్లు లేక, ఇల్లు కిరాయిలు కట్టలేని అనేకమంది దళితులు, పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారని, రోజురోజుకు ఇల్లు అద్దెలు పెరిగిపోతున్నా నేపధ్యంలో పూట గడవడమే కష్టంగా ఉంటుందని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి వాళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు .ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి కె.ప్రేమ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు రాజశేఖర్ ప్రదీప్ తరులు పాల్గొన్నారు.