చెన్నూర్ లో నేతకాని కులస్తున్ని ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం.

Published: Tuesday November 15, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన: 
 
రాబోయే ఎన్నికలలో చెన్నూర్ నియోజకవర్గంలో  నేతకాని కులస్తున్మి ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం అని తెలంగాణ నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ అన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. చెన్నూరు నిజాయకవర్గంలో 50 శాతం నేతకాని కులస్తులు ఉన్న ఇప్పటి వరకు నేతకాని ఎమ్మెల్యే గా ఒక్కరూ కూడా లేరని పేర్కొన్నారు.   గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ మంది జనాభా ఉన్న వారు ఎమ్మెల్యే లు గా వుంటున్నారని అన్నారు. చెన్నూర్ నియోజకవరం నేతకాని కులస్తులకు ఏనాడు కూడా కార్పొరేషన్లో కానీ, దళిత బంధు లో కానీ న్యాయం జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నేతకాని ఎమ్మెల్యే ని గెలిపించుకుంటమని, ఇందుకోసం నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ పల్లెపల్లె కు తిరిగి నేతకానిల ఐక్యతను చాటుకోవాలని తెలిపారు., నేతకాని కులస్తులకు జరుగుతున్న అన్యాయం పై వారికి వివరించి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ముడిమడుగుల శేఖర్, మహేష్,సాయి రమేష్,సిద్ధు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.