ఆదివాసి గిరిజన గ్రామాలకి అండగా ఉంటా వారి అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తా ప్రభుత

Published: Tuesday October 25, 2022
దట్టమైన అరణ్య ప్రాంతమైన రేగుల గండిలో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  విస్తృత పర్యటన..
 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన రేగుల గండిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  శుక్రవారం నాడు పలు శాఖల ప్రభుత్వ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవడానికి క్యాంపు కార్యాలయం నుంచి రేగుల గండి వరకు బైక్ పై ప్రయాణించి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం  విస్తృతంగా పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలు అభివృద్ధికి సీఎం కేసీఆర్  సారథ్యంలో అభివృద్ధి చేస్తుందన్నారు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని గ్రామాల అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.వలస ఆదివాసి గ్రామమైన రేగుల గండిలో పలు శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల మరియు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ ఉన్నత అధికారులు, సిసిఎఫ్ తో మాట్లాడి మిషన్ భగీరథ వాటర్ తీసుకురావాలి, దానితోపాటు రహదారి సౌకర్యం కరెంటు, వంటితోపాటు అనేక సమస్యలు ఉన్నాయి, తదితర అభివృద్ధి ఏర్పాట్లపై త్వరలోనే అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాటు చేస్తామన్నారు, పివి కాలనీ నుంచి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కరెంటు ఏర్పాటు మంజూరు చేపిస్తామన్నారు, రహదారి సౌకర్యం లేదని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని సమస్యలను ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో, అత్యవసర పరిస్థితులలో ఏమి వాహనాలు అందుబాటులో లేని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు, ఈనెల 26వ తేదీ నాడు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటోను కొనుగోలు చేసి అందిస్తామని వారు తెలియజేయడం జరిగింది, ఇటువంటి ఆదివాసి వలస గ్రామాలను ఇటువంటి గ్రామాలు ఉన్నాయో ప్రత్యేక పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు, వీరు సుమారు ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వీరికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఉండడంతో ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు, క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధించి సమస్యను పరిష్కరిస్తామన్నారు, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదివాసి గ్రామాలు ఏమున్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రొఫెసర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, ఈ మూడు జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు, కొంత అదిలాబాద్ జిల్లాలో వలస ఆదివాసి గ్రామాలు ఉన్నాయన్నారు, వీరందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఈ ప్రాంతంలో ప్రత్యేక గెజిట్ ఇవ్వాలని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా గుత్తి కోయల నివాసం లేరని  ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఈ గెజిట్ ను రాష్ట్రపతి విడుదల చేయాల్సింది ఉంటుంది, త్వరగా రీతిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి వారికి అందజేయాల్సింది గా తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వలస ఆదివాసి గ్రామాలకు సంబంధించి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ అందుకేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి అడవి ప్రాంతంలో ఉన్న వారి పిల్లల భవిష్యత్తు మారాలంటే ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు.ఎందుకంటే వారికి రిజర్వేషన్లు లేవు, సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా లేఖలు రాసినప్పటికీ కూడా వారు స్పందించడం లేదు తక్షణమే స్పందించాలి వీరు సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో లీగల్ గా కూడా  ఆదివాసి గ్రామాల తరఫున కోర్టును కూడా సంప్రదిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం  పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు*...