పాఠశాల కంపౌండ్ వాల్ కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం

Published: Monday August 02, 2021
జగిత్యాల, ఆగస్టు 01 (ప్రజాపాలన ప్రతినిధి):  పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ తోట మల్లికార్జున్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు ఆదివారం వినతి పత్రాన్నిఅందజేశారు. శంఖులపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కంపౌండ్ వాల్ గేటు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పాఠశాలకు కంపౌండ్ వాల్, గేటు నిర్మాణం కోసం నిధులు మంజూరి చేయాలని అలాగే అంగన్వాడి భవనం కోసం కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.