మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ ముఖ్యం.. --ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Monday August 22, 2022
జగిత్యాల, ఆగస్టు, 21 ( ప్రజాపాలన ప్రతినిధి): మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ ముఖ్యం అని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల  ఆదివారం నాడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం లో ప్రజలతో కలిసి జగిత్యాల ధరూర్ క్యాంప్ పార్క్ లో  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్  మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా గా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల పోరాటం తర్వాత మనం స్వాతంత్య్రం తెచ్చుకున్నాం అని నేడు వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు మాస్ ప్లాంటేషన్ ధరూర్ క్యాంప్ పార్క్ లో చేయటం  ఆనందం గా ఉందని అన్నారు. ప్రతి మున్సిపల్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హరిత హరం కార్యక్రమం చేపట్టి 6 నుంచి 10 లక్షల మొక్కలు నర్సరీల్లో పెంచుతున్నమని, ప్రతి గ్రామంలో సైతం నర్సరీ లను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నాం అని అన్నారు. ప్రతి గ్రామంలో, వార్డులలో ట్రాక్టర్ ట్యాంకర్ ఏర్పాటు చేస్తూ మొక్కలకు నీళ్లు అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నమని అన్నారు. రాష్ట్రం లో అటవీ విస్తీర్ణం సైతం పెరిగిందని అన్నారు. జగిత్యాల చుట్టూ శివారు ప్రాంతాలని పట్టణంలో కలిపి హరిత హరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, కమిషనర్ స్వరూప రాణి, స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, కౌన్సిలర్ లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.