బతుకమ్మ సంబరాలు : డిప్యూటి సిఈఓ సుభాషిణి

Published: Wednesday October 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 అక్టోబర్ ప్రజాపాలన : వికారాబాద్ మండల కార్యాలయం ముందు భాగంలో బతుకమ్మ ఆడిపాడామని డిప్యూటి సిఈఓ సుభాషిణి అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, మండల సిబ్బంది బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్, జిల్లా ఖజానా అధికారి దశరథ్ సంయుక్తంగా ప్రారంభించారు. జిల్లా నోడల్ అధికారి శంకర్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరించాలని అన్నారు. బతుకమ్మ వేడుకల ద్వారా ప్రకృతిని దైవంగా భావించి పూజించే ఆనవాయితి ప్రాచీన కాలం నుండి ఏర్పడిందని అన్నారు. జిల్లా ఖజానా అధికారి దశరథ్ మాట్లాడుతూ  ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. సర్పన్ పల్లి ఎంపిటిసి పుష్పలత కూతురు నిక్షిప్త బతుకమ్మ ఆటపాటలతో రంజింపజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎంపిపి కామిడి చంద్రకళ, కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్వర స్వామి, అధ్యాపకులు, ఎంపిఓ నాగరాజు, సూపరింటెండెంట్ చెన్నారెడ్డి, వికారాబాద్ మండల పంచాయతీ కార్యదర్శులు, మండల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.