*తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం* -కంటి వెలుగు కార్యక్రమంతో అందుల జీవితాలలో వెలుగులు. –ప్రజా

Published: Friday January 20, 2023
చేవెళ్ల, జనవరి 19,(ప్రజాపాలన):-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.
గురువారం మండల పరిధిలోని అంతారం,ఆలూరు గ్రామాల్లో  ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టిసారించారని అన్నారు. అందుకోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాన్ని ఢిల్లీ,పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. కంటి పరీక్షల అనంతరం ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందిస్తారని, అవసరమైన వారికి రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు   ప్రభుత్వం భరించి అపరేషన్లు కూడ చేయిస్తారని తెలిపారు. 100 రోజులు పాటు  గ్రామాలలో నిర్వహించే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంధత్వ రహిత చేవెళ్ల  ఏర్పాటుకు అందరు తోడ్పాటు అందించి.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవరావు,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  దామోదర్ ,చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్, అంతారం సర్పంచ్ సులోచన అంజన్ గౌడ్ ఎంపీటీసీ కావలి సులోచన, ఆలూరు సర్పంచ్ విజయలక్ష్మి నరసింహులు, ఏఎంసి చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దొళ్ళ ప్రభాకర్, సి హెచ్ ఓ గోపాల్ రెడ్డి, అంతారం కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ బాబు, గణపురం తరుణ్, బిఆర్ఎస్ నాయకులు శేఖర్, గని,నవీన్,జంగయ్య,వెంకటేష్ వైద్యాధికారులు,కంటి వైద్య నిపుణులు,ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.