కరోనా రహిత గ్రామం కొరకు సహకరించాలి.

Published: Wednesday June 09, 2021
పాలేరు జూన్ 8( ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి కరోనా రహిత గ్రామం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కొత్తకొత్తూరు సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయం లో కోవిడ్ పరీక్షల కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కరోనా విజృంభణను తగ్గించేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని అన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ కేంద్రంలోనే ఉండాలని అన్నారు. కరోనా వచ్చిన వారిలో మనోధైర్యం ను నింపేందుకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున్న సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైదారెడ్డి. వార్డు సభ్యులు పాగర్తి సధాకర్, దేవరశెట్టి రాము. ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.