ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు చిత్రలేఖన పోటీలు

Published: Wednesday November 16, 2022
బోనకల్ ,నవంబర్ 15 ప్రజా పాలన ప్రతినిధి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రై సంస్థ సహకారంతో ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న పది ప్రాథమిక పాఠశాల ల నందు బాలల దినోత్సవ సందర్భంగా ఆర్ట్ , క్రాఫ్ట్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. కేవీఎం జడ్పీఎస్ఎస్ ఆళ్లపాడు పాఠశాల నందు మంగళవారం జరిగిన బాలల దినోత్సవం పురస్కరించుకొని బాలల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లలకు వారి యొక్క హక్కులు, వారి కోసం పనిచేస్తున్న హెల్ప్ లైన్ నెంబర్లు, అదేవిధంగా వారికోసం పనిచేసే వివిధ రకాలైన వ్యక్తులకు సంబంధించి వారికి ఉన్న అవగాహన మేరకు డ్రాయింగ్స్ గీసే విధంగా పోటీ నిర్వహించడం జరిగింది. బాలలచే గీయబడిన డ్రాయింగ్ షీట్లను పాఠశాలలో ఒక రూమ్ లో అతికించి దానిని చైల్డ్ రైట్స్ కార్నర్ గా తయారుచేసి పిల్లలు గీసిన డ్రాయింగ్ లను సందర్శించే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంసి మెంబర్లు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ల నుండి పెద్దలను ఆహ్వానించడం జరిగింది. ఈ డ్రాయింగ్స్ పక్కనే ఒక చార్ట్ ను అంటించి ఆ చార్ట్ పై వచ్చిన అతిధుల యొక్క సంతకాలను , పిల్లల యొక్క సంతకాలను సేకరించి పిల్లలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ విధంగా ప్రతి పాఠశాల నుండి మొదటి, రెండవ డ్రాయింగ్ లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా సెలెక్ట్ చేసిన వారందరిని రేపు జరగబోయే మండల స్థాయి ఆర్ట్ కాంపిటీషన్లో వారికి వేరే పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో "మై డ్రీమ్స్ స్కూల్" అనే కాన్సెప్ట్ తో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా కాంపిటీషన్ నిర్వహించి మండల స్థాయిలో గెలిచిన ఈ పోటీలో పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులు ప్రధానం చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతి రావు, ప్రధానోపాధ్యాయులు రమేష్ , పాఠశాల సిబ్బంది, ఎఫెర్టు సంస్థ సభ్యులు నర్సమ్మ, పిఈటి మాధవరావు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.