ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన మధిర పోలీస్ మధిర రూరల్ డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సి

Published: Tuesday December 06, 2022

మధిర సీఐ మురళి ఆదేశాలతో పోలీస్ సిబ్బంది పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ప్రవర్తనపై ఆరావిద్యార్థుల కదలకపై దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించిన పోలీసులుమధిర సీఐ మురళి చర్యలను అభినందించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులవిద్యార్థులు మత్తు పదార్థాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు మధిర పోలీస్ శాఖ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది.సీఐ ఒడ్డేపల్లి మురళి శాంతి భద్రతల కాపాడటంలో విధి నిర్వహణలో ముక్కు సూటిగా ఉంటూ నిజాయితీపరుడుగా జిల్లా పోలీస్ శాఖలో పేరు ఉంది. రాష్ట్రంలో పలు విద్యాలయాల్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్న తరుణంలో మధిర పోలీస్ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా మధిర సీఐ మురళి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది పాఠశాలలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులు కలిసి విద్యార్థుల ప్రవర్తన పై ఆరా తీస్తున్నారు. ఇకనుండి విద్యార్థుల నడవడికపై తప్పనిసరిగా ఉపాధ్యాయుల దృష్టి సారించాలని పోలీసులు కోరారు.  విద్యార్థుల నడవడకపై అనుమానం ఉంటే వెంటనే తల్లిదండ్రులను పిలిపించాలని వారు సూచించారు. మధిర పోలీస్ శాఖ తీసుకున్న చర్యలపై సిఐ మురళి మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి తెలియక మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని దీనిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని లక్ష్యంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధిర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు తల్లిదండ్రులు కూడా తన పిల్లలు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారో దృష్టి సారించాలన్నారు. పిల్లలకు వీలైనంత వరకు ఫోన్లు దూరంగా ఉంచాలని ఒకవేళ కంపల్సరిగా ఫోను ఇవ్వాల్సి వస్తే పిల్లల వాడుతున్న ఫోన్ పై కూడా నిఘా ఉంచాలని ఆయన సూచించారు